Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

రెచ్చగొట్టే విద్వేష సంస్కృతి దేశ భద్రతకు, ఐక్యతకు ప్రమాదం

19-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా

దేవేందర్ నగర్ లో కోవా-బన్ను వివాదంపై జరిగిన వివిధ రాజకీయ, పార్టీల ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.

ఇటీవల మేడారం సమ్మక్క, సారక్క జాతరలో చోటుచేసుకున్న కోవా-బన్ను వివాదం లాంటి ఘటనలు, ప్రచారాలు భారతదేశ ఐక్యతకు,భద్రతకు ప్రమాదం అని జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా స్పష్టం చేశారు. 2026, ఫిభ్రవరి-18, బుధవారం రోజు, కాప్రా, జవహర్ నగర్ జీహెచ్ఎంసి, చెన్నాపురం-దేవేందర్ నగర్ లో వివిధ ప్రజాసంఘాలు, పార్టీలకు చెందిన నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ముస్లిం కమిటీ కార్యదర్శి టి.కాలేషా అధ్యక్షతన జరిగింది.తమ సామాజిక భాద్యతను విస్మరించి, భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, ప్రజాస్వామ్యాన్ని, విలువలను అపహాస్యం చేసేలా ప్రవర్తించిన చెస్కా, మస్కా మీడియా ప్రచారాలపై, వారి వ్యవహారాలపై పోలీసు అధికారులు, పాలకులు, కఠినంగా వ్యవహరించాలని, లేని యెడల ఇదే సంస్కృతిని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రమాదం ఉందని రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన పార్టీ, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. కర్నూలు జిల్లా,నంద్యాలకు చెందిన షేక్ షావలి,జావేద్ పొట్టపట్టుకొని మేడారం జాతరలో పాలకోవా- బన్నులతో చిన్న వ్యాపారం సాగిస్తున్న వారిపై తేజశ్వీని లాంటి చెస్కా, మస్కా మీడియా ప్రేరేపించే మత, ప్రాంతీయతత్వాలను ముక్త కంఠంతో ఖండించారు.పేరును బట్టి మతం, ప్రాంతం బట్టి విద్వేషం, కులం బట్టి, ఉన్మాద చర్యలకు పాల్పడే ఇలాంటి వారందరు కూడ చేపట్టే చర్యలు, ప్రచారాలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవల్సి వస్తుందని మండిపడ్డారు.అన్నివర్గాల, మతాల ప్రజల ప్రయోజనాలను, వారి హక్కులను పరిరక్షించే రాజ్యాంగ గ్రంథం పట్ల విశ్వాసం లేకపోయిన ఫర్వాలేదని, కానీ సోదర తత్వాన్ని ద్వంసం చేసే విషపూరిత ప్రచారాలు చేసేవారు ఉగ్రవాదులతో సమానం అని అన్నారు. పని గట్టుకొని మీడియాపై, పాత్రీకేయులపై గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారి పట్ల అసలైన మీడియా మిత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జవహర్ నగర్, బీఎస్పీ పార్టీ అధ్యక్షులు, కలకోట ప్రభాకర్, అభ్యుదయ రచయిత షేక్ మీరా, ఏ ఐ ఎఫ్ టి యు అధ్యక్షులు వై మల్లేష్,ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి, పిఓడభ్ల్యూ(విముక్తి) పెర్క సునీత, ఆప్ తెలంగాణ ఫౌండర్ మహమ్మద్ మోయుద్దిన్, కమిటీ సభ్యులు మహమ్మద్ సోహెల్, మహమ్మద్ గౌస్ బాబా, సయ్యద్ ముబాషీర్ అలియాస్ అబ్బు,మహమ్మద్ వహీద్, సయ్యద్ సయ్యద్, ఎండి అలీ, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Sthanikam

రెచ్చగొట్టే విద్వేష సంస్కృతి దేశ భద్రతకు, ఐక్యతకు ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News