Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం

రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం

రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం
09-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పిండిప్రోలులో అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నివాళి

టి.పాలెం, ప్రతిఘటన పోరాటయోధుడు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అమరుడు రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) ఆశయ సాధనకు పునరంకితమవుదామని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆయన 10వ వర్ధంతి సందర్భంగా పిండిప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన రవన్న విగ్రహానికి న్యూడెమోక్రసీ నాయకత్వం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ పార్టీలో సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉద్యమ బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ప్రతిఘటన పోరాట పంథాలో సుమారు 48 ఏళ్ల పాటు జీవితాంతం రహస్య జీవితం గడిపి ఉద్యమానికి అంకితమయ్యారని పేర్కొన్నారు.

కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చేపట్టిన ప్రజా యుద్ధపంథా మార్గంలో గోదావరి లోయ ప్రాంతంలో పోరాటాలను నిర్మించి వేలాది ఎకరాల భూములను పేద ఆదివాసి, గిరిజన ప్రజలకు సాధించి పెట్టారని అన్నారు. ఆదివాసి గ్రామాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో రవన్న చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. పార్టీ ఐక్యత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.

2016 మార్చి 9న బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కామ్రేడ్ రవన్న భౌతికంగా దూరమవడం భారత విప్లవోద్యమానికి, విప్లవకారులకు తీరని లోటుగా నిలిచిందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితమవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుభాన్, ఉమాశంకర్, మోహన్‌రావు, పోలేపొంగు నాగయ్య, గొర్రెపాటి వీరస్వామి, ఎస్‌కే షబ్బీర్, పేరం వెంకటేశ్వర్లు, మాగి విజయ్, లింగన్న, రాకేష్, లక్ష్మణ్, రమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రవన్న ఆశయ సాధనకు పునరంకితమవుదాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News