Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 10:32 AM

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..
29-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పానగల్ రైతు వేదిక వద్ద బాధితుల నిరసన

బ్యాంకు పేరు మార్పుతో తలెత్తిన 'ఐఎఫ్ఎస్సీ' చిక్కులు..

రోడ్డుపై బైఠాయించి ఆందోళన, అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం..

నల్లగొండ : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమ దరికి చేరడం లేదంటూ నల్లగొండ జిల్లాలోని పానగల్ - ఖాజీ రామారం రైతు వేదిక వద్ద రైతులు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం కారణంగా సుమారు 300 మంది రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమకు రుణమాఫీ వర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు.ముఖ్యంగా ఏపీజీవీబీ (APGVB) బ్యాంకు ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGGVB) గా రూపాంతరం చెందడంతో ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్‌ల మార్పు జరిగిందని దీనివల్ల డేటా మిస్ మ్యాచ్ అయ్యి తమకు రుణమాఫీ నిధులు జమ కాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జనవరి 1, 2025న బ్యాంకుల విలీనం జరిగినప్పటికీ, జనవరి 18న ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత రుణమాఫీలో తమ పేర్లు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రేషన్ కార్డు లేని రైతులకు సైతం రుణమాఫీ క్లియర్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ఏపీజీవీబీ ఖాతాదారులైన తమకు మాత్రం అన్యాయం జరిగిందని బాధితులు వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ధ్వజం..

బ్యాంకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 300 మంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, సాంకేతిక సమస్యలను పరిష్కరించి తమ ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. 

Sthanikam

రుణమాఫీ ఏది? రైతుల ఆవేదన..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News