Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.
27-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ అనురాధకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ… 619 సర్వే నంబర్ల పరిధిలోని లోతుకుంట భూమి అక్రమ కబ్జాకు గురవుతోందని ఆరోపించారు. సిమెంట్ ఇటుక తయారీ పేరుతో ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భూమిని సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 7వ వార్డులో అసంపూర్తిగా ఉన్న మోరీలను పూర్తి చేయాలని, 14వ వార్డులో కోర్టు కాలనీ నుంచి పెద్ద మోరీ వరకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని కోరారు. అమ్మనబోలు రూట్‌లో మోకాళ్ల సోమయ్య ఇంటి వద్ద ప్రమాదకరంగా ఉన్న మోరీని సరిచేయాలని, సకరికుంట నుంచి ఆసుపత్రి వరకు వరద కాలువ నిర్మించాలని తెలిపారు.

12వ వార్డులో పద్మశాలి కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, మాజీ సర్పంచి మొగులయ్య ఇంటి వద్ద అసంపూర్తిగా ఉన్న మోరీని పునరుద్ధరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పల్లె సత్యం, వెంకట్ రెడ్డి, బావడ్లపెళ్లి సత్యం, గంజి అశోక్, బొల్ల వెంకటేశ్వర్లు, రాసాల రమేశ్, నకిరేకంటి సురేశ్, మునుకుంట్ల రాణి, కుందూరు వెంకటేశ్వర్లు, గొరిగే మల్లేశం, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో సమస్యల పరిష్కారానికి వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News