Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:46 AM

రామన్నపేటలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: సీపీఎం

11-03-2026 338 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

:రామన్నపేట పట్టణంలో పాత నేతాజీ క్లబ్‌ను పునరుద్ధరించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 16న సీపీఎం ఆధ్వర్యంలో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక క్రిస్టియన్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి సీపీఎం కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ రామన్నపేట ఆసుపత్రి నిర్మించి 52 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరిందని తెలిపారు. ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ప్రస్తుతం కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాత నేతాజీ క్లబ్ అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో దానిని పునరుద్ధరించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే పట్టణ యువతతో పాటు సీనియర్ సిటిజన్లకు వ్యాయామం చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అలాగే అక్కడ ముందుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని పాలకులు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, బోళ్ళ వెంకన్న, పల్లె సత్యం, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: సీపీఎం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News