Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

రామన్నపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

05-04-2026 218 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో భారత మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి బంగ్లాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు.

1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని చంద్వా గ్రామంలో జన్మించిన ఆయన, సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగి జాతీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా దాదాపు 50 సంవత్సరాలు సేవలందించి విశేష కీర్తి గడించారని గుర్తుచేశారు. 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించినట్టు తెలిపారు.

అలాగే 1928లో జరిగిన కార్మిక ర్యాలీలో సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించిన ఆయన, దళిత హక్కులు మరియు సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా నిలిచారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, బొడ్డు సురేందర్ రావు, మహమ్మద్ నాసర్, కుమార్, ఆముద లక్ష్మణ్, గొరిగి శేఖర్, బండ లింగస్వామి, కొమ్ము రామస్వామి, గంగాపురం శంకర్, మొహమ్మద్ అజార్, ఊరే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News