Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

07-04-2026 126 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈనెల 11న రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రామన్నపేట మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

జిల్లా 3వ మహాసభలను మే 18, 19 తేదీలలో రామన్నపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక స్థానం సంపాదించిన రామన్నపేట అనేక కూలీ, భూమి పోరాటాలకు కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. కవులు, కళాకారులు, జానపద కళలకు ఈ ప్రాంతం నిలయమని పేర్కొన్నారు.

1936లో స్థాపితమైన వ్యవసాయ కార్మిక సంఘం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూముల పంపిణీ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని, కూలీలకు తగిన వేతనాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. జాతీయ స్థాయిలో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా సంఘం పోరాటాలు దోహదపడ్డాయని వివరించారు.

ఈ నేపథ్యంలో జరుగుతున్న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు.

Sthanikam

రామన్నపేటలో ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం 11న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News