Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.

22-04-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐడియల్ కంపెనీ సిఎస్‌ఆర్ నిధుల కింద 10 కంప్యూటర్లు, 4 ప్రింటర్లు అందజేశారు. కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పరికరాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం స్వీకరించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ పరికరాలను అందజేశామని తెలిపారు.

ప్రిన్సిపాల్ ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అందించిన కంప్యూటర్లతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

జనరల్ మేనేజర్ వైద్యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్థానిక విద్యార్థుల అభివృద్ధికి సంస్థ తరఫున సిఎస్‌ఆర్ సహకారం కొనసాగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో సిఎస్‌ఆర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్ల విరాళం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News