Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం

10-04-2026 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రద్దయిన రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని అఖిలపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేశాయి. నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశాయి. స్థానిక రహదారి బంగళాలో జరిగిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి మండలారెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకుడు గంగుల రాజిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం మాట్లాడారు. సుమారు 50 సంవత్సరాలు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గం 2009లో రద్దు కావడంతో ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రామన్నపేటలో ఇప్పటికే డివిజనల్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో నియోజకవర్గంగా మారేందుకు అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. పునరుద్ధరణ న్యాయమైన డిమాండ్ అని, ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, గ్రామాల ప్రజలు మహా పోరాటానికి సిద్ధంగా ఉండాలని నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కన్నెకంటి వెంకటేశ్వర చారి, టిపిసిసి అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర, సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, బిఆర్ఎస్ నాయకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గం పునరుద్ధరణకు అఖిలపక్షాల గళం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News