Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్.

11-04-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల ఏకగళం… రణభేరి మోగించిన సాధన సమితి

రామన్నపేటను మళ్లీ శాసనసభ నియోజకవర్గంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లో ఉద్యమ జోరు పెరుగుతోంది. ఈ మేరకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ప్రచార కార్యదర్శి జెట్టి శివ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక నియోజకవర్గంగా ఉన్న రామన్నపేటను తరువాత తొలగించడంతో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు అనేక పరిపాలనా, అభివృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రామన్నపేట ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాలు దూరంగా ఉండడం వల్ల ప్రభుత్వ సేవలు అందుకోవడం కష్టంగా మారిందని, అభివృద్ధి అసమానంగా జరుగుతోందని విమర్శించారు. అదేవిధంగా ప్రజలకు సరైన రాజకీయ ప్రతినిధిత్వం లేకపోవడం, గ్రామీణ అవసరాలు పట్టించుకోబడకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో రామన్నపేటకు ప్రత్యేక శాసనసభ నియోజకవర్గ హోదా మళ్లీ కల్పించి, ప్రజలకు సమర్థవంతమైన పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు.

“రామన్నపేట నియోజకవర్గం మా హక్కు… సాధించేదాకా పోరాటం ఆగదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News