Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.

07-04-2026 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, మౌలిక సదుపాయాలను అధికారులకు వివరించారు.

నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా పాత రామన్నపేట నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని సమితి నాయకులు కోరారు. నియోజకవర్గ ఏర్పాటుకు అవసరమైన అన్ని కార్యాలయాలు, వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంలో అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు.

ఈ క్రమంలో రామన్నపేట సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ డి. నాగరాజులను సన్మానిస్తూ నియోజకవర్గ సాధనలో తమ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎర్ర రమేష్ గౌడ్, ఎస్కే చాంద్, నాయకులు పోతరాజు శంకరయ్య, వరికల్ గోపాల్, ఎండి ఫజల్, గంగాపురం యాదయ్య, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఏలూరు రవి, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, బర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నియోజకవర్గ ఏర్పాటు కోరుతూ సీఐ, ఎస్ఐలకు సన్మానం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News