Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:34 AM

రామన్నపేట మహాసభలను జయప్రదం చేయాలి

రామన్నపేట మహాసభలను జయప్రదం చేయాలి

రామన్నపేట మహాసభలను జయప్రదం చేయాలి
11-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మే 18, 19 తేదీల్లో రామన్నపేటలో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

స్థానిక కాచం కృష్ణమూర్తి భవన్‌లో జల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగిన ఆహ్వాన సన్నాహక సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని, విబిజిరామ్ జి పేరుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. పనులు చేసిన కార్మికులకు నెలల తరబడి కూలి చెల్లింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేదలపై భారమవుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మేలు ముకుంద, కార్యదర్శిగా కందుల హనుమంతును ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి, సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, రాచకొండ రాములమ్మ, కూరెళ్ల నర్సింహాచారి, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్, గన్నబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, కొమ్ము అంజయ్య, పిట్టల పద్మ, శానకొండ వెంకటేశ్వర్లు, నాగటి లక్ష్మణ్, మచ్చ నరేష్, గూని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మహాసభలను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News