Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి – సిపిఎం

10-03-2026 411 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

స్థానిక రావనపేట రహదారి బంగ్లాలో అఖిలపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి నిరాహార దీక్షల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిసర మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ప్రస్తుతం అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రోజుకు సుమారు 400 మంది అవుట్‌పేషెంట్లు వస్తున్నప్పటికీ తగినంత మంది వైద్యులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో కూడా సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఏరియా ఆసుపత్రిగా బోర్డు పెట్టి 15 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ 30 పడకలకే పరిమితమైందని విమర్శించారు. వెంటనే బడ్జెట్ సమావేశాల్లో వంద పడకల ఆసుపత్రికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, లేకపోతే మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో టీడీపీ నాయకులు ఫజల్ బేగ్, సిపిఐ నాయకులు రచ్చ యాదగిరి, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, బోయిని ఆనంద్, కందుల హనుమతు, గొరిగే సోములు, గన్నేబోయిన విజయభాస్కర్, ఎండీ రషీద్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, మునికుంట్ల లెనిన్, ఆవనగంటి స్వామి, గంటెపాక శివకుమార్, గట్టు నర్సింహా, పల్లె సత్యం, మేడి గణేష్, పుట్టల ఉదయ్, శానగొండ రామచంద్రం, గోగు లింగస్వామి, శానగొండ వెంకటేశ్వర్లు, పెండెం భ్రహ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి – సిపిఎం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News