Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:02 PM

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి బడ్జెట్‌లో ₹40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలి

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి బడ్జెట్‌లో ₹40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలి

రామన్నపేట ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలి బడ్జెట్‌లో ₹40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలి
March 09, 2026 05:41 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సీపీఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 60 సంవత్సరాల క్రితం ఏర్పడిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి పాత నియోజకవర్గ కేంద్రంగా సుమారు ఎనిమిది మండలాలకు వైద్య సేవలు అందించిందన్నారు. ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేక పేదలకు నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనం పాడైపోయి వెచ్చులూడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో రోగులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొన్నదన్నారు. అత్యవసర వైద్య సేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక వైద్య పరికరాలు లేక ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.

16 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు

ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. మండల ప్రజలు సీపీఎం చేపట్టే ఈ ప్రజా పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు రెబ్బాస్ రాములు, టీడీపీ మండల నాయకుడు ఫజల్ బేగ్, సీపీఐ మండల నాయకుడు రచ్చ యాదగిరి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, గన్నెబోయిన విజయభాస్కర్, ఎండీ రషీద్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, పట్టణ శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆవనగంటి స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివకుమార్, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా, పల్లె సత్యం, మేడి గణేష్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్, డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, శాఖ కార్యదర్శులు గోగు లింగస్వామి, శానగొండ వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News