Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

రామన్నపేట అభివృద్ధి శిల్పి – పురుషోత్తం రెడ్డి సేవలు చిరస్మరణీయం.కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

10-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రముఖ నాయకుల్లో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ఒకరని రామన్నపేట సాధన సమితి గౌరవ అధ్యక్షులు, పలివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు.

పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సాధన సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పురుషోత్తం రెడ్డి చరిత్రను తెలుసుకోవడం ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు.

1933లో యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో జన్మించిన పురుషోత్తం రెడ్డి, గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తరువాత రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా కీలక పదవులు నిర్వహించారు.

1947లో కాంగ్రెస్ పార్టీలో చేరి, హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1969–72 మధ్య చిన్ననాటి వనరుల శాఖ మంత్రిగా, 1974–77 మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

తన పదవీకాలంలో రామన్నపేటలో డిగ్రీ కళాశాల, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్, ఏరియా ఆసుపత్రి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

Sthanikam

రామన్నపేట అభివృద్ధి శిల్పి – పురుషోత్తం రెడ్డి సేవలు చిరస్మరణీయం.కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

Article Image

రామన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ప్రముఖ నాయకుల్లో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ఒకరని రామన్నపేట సాధన సమితి గౌరవ అధ్యక్షులు, పలివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు.

పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సాధన సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పురుషోత్తం రెడ్డి చరిత్రను తెలుసుకోవడం ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు.

1933లో యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో జన్మించిన పురుషోత్తం రెడ్డి, గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, తరువాత రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా కీలక పదవులు నిర్వహించారు.

1947లో కాంగ్రెస్ పార్టీలో చేరి, హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1969–72 మధ్య చిన్ననాటి వనరుల శాఖ మంత్రిగా, 1974–77 మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

తన పదవీకాలంలో రామన్నపేటలో డిగ్రీ కళాశాల, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్ స్టేషన్, ఏరియా ఆసుపత్రి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News