Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

రాజగోపాల్ రెడ్డి పోరాటానికే దక్కిన ఫలితం

22-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ బస్టాండ్ వద్ద వెహికల్ అండర్‌పాస్ మంజూరు

మార్కింగ్ పూర్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన పెద్దగోని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. జాతీయ రహదారిపై నిర్మితమవుతున్న ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా, బస్టాండ్ సమీపంలో వెహికల్ అండర్‌పాస్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ అన్నారు.​స్థానిక ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. రీజనల్ ఆఫీసర్ శివశంకర్, పీడీ శ్రీనివాస్, ఫ్లైఓవర్ ఇంచార్జ్ సైఫీ తదితర అధికారులకు క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరించారు. చౌటుప్పల్ లో పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్ లేదా బస్టాండ్ వద్ద వెహికల్ అండర్‌పాస్ తప్పనిసరి అని ఆయన పట్టుబట్టారు.20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం ఎమ్మెల్యే వినతికి సానుకూలంగా స్పందించిన అధికారులు, బస్టాండ్ పరిధిలోని బాలాజీ స్వీట్ హౌస్ ఎదురుగా 20 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ నిర్మించేందుకు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.​"చౌటుప్పల్ పట్టణ అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఉన్న చిత్తశుద్ధికి ఈ అండర్‌పాస్ మంజూరు నిదర్శనం. ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారులపై ఒత్తిడి తెచ్చి దీనిని సాధించినందుకు పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు.

Sthanikam

రాజగోపాల్ రెడ్డి పోరాటానికే దక్కిన ఫలితం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News