Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:34 AM

రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు

14-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం వ్యవసాయం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

చనుబండ రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంట నమోదు ప్రక్రియపై రైతులతో చర్చించారు. అనంతరం అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ రైతన్నకు ఇచ్చిన హామీని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందుతున్నదని తెలిపారు.

ఈ పథకాలలో భాగంగా మూడవ విడత కింద రూ.6,000ను నేరుగా డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అన్నదాతలకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రైతుల ఖాతాల్లో మొత్తం రూ.8,985.41 కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల 85 వేల 838 మంది రైతులకు ఈ సాయం లభించనుందని తెలిపారు.

అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతలో దేశవ్యాప్తంగా 9.32 కోట్లకు పైగా రైతులకు నేరుగా డీబీటీ పద్ధతిలో నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గవర వెంకటేశ్వరరావు, బొట్టు దుర్గారావు, మిద్దె సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగమణి, పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News