Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:34 AM

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

రైతు సంఘం జెండా ఆవిష్కరణ
11-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలో రైతు సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం కార్యదర్శి బసాపురం గోపాల్ నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి. సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి బిజీ ఎల్లప్ప మాట్లాడుతూ 1936లో లక్నోలో స్థాపితమైన రైతు సంఘం 90 ఏళ్లుగా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని తెలిపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర రైతు సంఘానిదని పేర్కొన్నారు.

మహాకూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వెంటనే “సూపర్ సిక్స్” హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులు పండించే పంటలకు ముందుగానే ధర ప్రకటించాలని, కల్తీ ఎరువులు, మందులను అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గుళ్లం సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్, మలగవల్లి–నగరడం ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, గ్రామ రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంఘం జెండా ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News