Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి

10-04-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం,

నడికుడి–బీబీనగర్ రెండో రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.1.50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.

శుక్రవారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో నిర్వహించిన సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ… తరతరాలుగా భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు ప్రభుత్వ అవసరాల పేరుతో భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు స్వాధీనం చేసుకునే ముందు ప్రభుత్వం హామీలు ఇస్తున్నప్పటికీ, తర్వాత తగిన నష్టపరిహారం చెల్లించడంలో విఫలమవుతోందని విమర్శించారు. అనాజిపురంలో ఎకరం భూమి మార్కెట్ విలువ రూ.1.50 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం కేవలం రూ.22 లక్షలు మాత్రమే చెల్లించడం అన్యాయమని ప్రశ్నించారు.

ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇతర ప్రాంతాల్లో కనీసం 10 గుంటల భూమి కొనుగోలు చేయడానికి కూడా సరిపోదని అన్నారు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మార్కెట్ రేటుకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైల్వే ట్రాక్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటుకు నష్టపరిహారం ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News