Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:35 AM

పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్‌గా మోదీరాందేవ్

10-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఎంపీ వి.హెచ్. హనుమంతరావు, వైస్ చైర్మన్‌లతో పాటు కన్వీనర్‌గా పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్‌ను నియమిస్తూ శుక్రవారం జీవో నెం.174 జారీ చేసింది.

ఈ సందర్భంగా మోదీరాందేవ్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయుని జయంతి ఉత్సవ కమిటీలో చోటు దక్కడం తనకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. గత 16 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తించి తనను కన్వీనర్‌గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్, కమిటీ చైర్మన్ వి.హెచ్. హనుమంతరావు సహా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఏప్రిల్ 11న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో జరిగే జయంతి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

పూలే ఉత్సవ కమిటీకి కన్వీనర్‌గా మోదీరాందేవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News