Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:22 AM

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో
22-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నల్గొండ బస్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాల దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే పోలీస్ బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు.

డిపో ఆవరణను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆందోళనకారులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలోని 7 రీజియన్ల పరిధిలో సుమారు 702 బస్సులు నిలిచిపోనున్నట్లు సమాచారం. సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Sthanikam

పోలీసుల ఆధీనంలో నల్గొండ బస్ డిపో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News