Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య

11-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి సందర్భంగా జగదేవ్‌పూర్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రపంచ మేధావి, విద్య ద్వారా సమాజాన్ని మార్చవచ్చని నమ్మిన మహనీయుడని పేర్కొన్నారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేతో కలిసి బాలికల విద్యకు శ్రీకారం చుట్టి దేశంలో తొలి ఉపాధ్యాయులుగా నిలిచారని తెలిపారు. సమానత్వం, మహిళా సాధికారత, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పూలే మహిళల అభివృద్ధికి పునాది వేశారని, వారి ఆశయాలను అనుసరించి ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పూలే ఆశయమని, ఆ దిశగా ముందుకు సాగాలని సూచించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం మహనీయులను స్మరిస్తూ ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి సాహితి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News