Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:37 AM

ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం పెంచాలి పోషకాహార లోపాల నివారణకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు

25-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లాలో పోషకాహార భద్రత బలోపేతానికి ఆహార పదార్థాల ఫోర్టిఫికేషన్‌పై కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిల్లర్ల సంఘ ప్రతినిధులు, అంగన్‌వాడీ సంఘ అధ్యక్షులు, రిటైల్ దుకాణదారులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మనోహర్ మాట్లాడుతూ… ప్రజల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ–12తో సమృద్ధిగా తయారు చేసిన ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం అత్యంత అవసరమని వివరించారు. రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కీలకమన్నారు.

జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల ద్వారా సరఫరా అవుతున్న ఫోర్టిఫైడ్ బియ్యం ప్రయోజనాలను వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ హాస్టళ్ల ద్వారా పంపిణీ జరుగుతున్న విధానాన్ని తెలియజేశారు.

జిల్లా సంక్షేమాధికారి నర్సింగ్ రావు మాట్లాడుతూ… అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో ఫోర్టిఫైడ్ ఆహారం అందించడం ద్వారా బాలల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. గెజిటెడ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి, ఆహార భద్రత అధికారి శివశంకర్ రెడ్డి ఫోర్టిఫికేషన్ అమలు విధానం, నాణ్యత నియంత్రణ, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఫోర్టిఫికేషన్ శిక్షకుడు డా. ఆంజనేయులు చాగంటి శాస్త్రీయ ప్రాముఖ్యతను వివరించి, మిల్లర్లు పాటించాల్సిన సాంకేతిక మార్గదర్శకాలను వివరించారు.

Sthanikam

ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం పెంచాలి పోషకాహార లోపాల నివారణకు కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News