Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

09-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ముందు జరిగిన ఈ నిరసనలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని విమర్శించారు.

హైకోర్టు తీర్పు ప్రకారం ముందుగా విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసి తర్వాత ప్రభుత్వం చెల్లించడం సరైన విధానం కాదని, ఈ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో క్యాంప్‌ కార్యాలయం గేటుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల రాహుల్, తీగుళ్ల శ్రీనివాస్, దరావత్ జగన్నాథ్, పుట్టల ఉదయ్, జిల్లా కమిటీ సభ్యులు ఈర్ల కార్తీక్, బుగ్గ ఉదయ్, మైసూర్ల నరేందర్, దాసరి ప్రకాశ్, ప్రవీణ్, రోహిత్, చరణ్, శివ, అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News