Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

27-04-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పెట్రోల్‌, డీజిల్ కొరతతో కష్టాలు రామన్నపేటలో మూతపడ్డ బంకులు.. క్యూలలో ప్రజలు

Article Image

రామన్నపేట: మండలంలో పెట్రోల్‌, డీజిల్ కొరత తీవ్రమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఇంధన సమస్య సోమవారం నాటికి మరింత ఉధృతమైంది. కంపెనీల నుంచి సరఫరా తగ్గిపోవడంతో మండలంలోని పలు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.

ఇంధనం అందుబాటులో లేకపోవడంతో కొన్ని బంకులు పూర్తిగా మూతపడగా, స్టాక్ ఉన్న బంకుల వద్ద మాత్రం వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనులు వదిలి ఇంధనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

ఇంధన కొరతపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News