Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

27-04-2026 312 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డుకు అడ్డంగా కట్టిన వైర్ మెడకు తగిలిన ఘటన

: పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యంతో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… దమ్మాయిగూడెం నుంచి బచ్చోడు వైపు వెళ్తున్న నందిపాటి ఉపేందర్, బీరోలు వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ప్రమాదానికి గురయ్యాడు.

పెట్రోల్ లేదని చెప్పుతూ బంక్ యజమాని రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టివేయడంతో అది గమనించలేకపోయిన ఉపేందర్ మెడకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటన పూర్తిగా బంక్ యజమాని నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా రోడ్డుకు అడ్డంగా వైర్ కట్టడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు.

ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు, సంబంధిత పెట్రోల్ బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయడంతో పాటు అవసరమైతే బంకును సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Sthanikam

పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం.. ప్రయాణికుడికి తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News