శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మెడికల్ కాలేజీ సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఆహుడా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఔట్‌లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.
రూ. 16.6 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆహుడా చైర్మన్ టీ.సి. వరుణ్ , సంబంధిత అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ టౌన్‌షిప్ అభివృద్ధి ద్వారా పెనుకొండ పట్టణానికి మరింత ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి