Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

10-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బి.అక్షయకు సంఘమిత్ర సేవా సమితి ఆదర్శప్రాయంగా ముందుకు వచ్చి ఫీజు సహాయం అందించింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఈ విద్యార్థిని చదువు మధ్యలోనే ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 8వ వార్డు కౌన్సిలర్,సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల సంపత్ తనవంతు సహాయంగా ఫీజును పూర్తిగా చెల్లించారు.సమాజంలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.విద్య అనేది ప్రతి ఒక్కరికీ హక్కు అని,ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకి కాకూడదని సంపత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సహాయం పట్ల విద్యార్థిని నానమ్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ,తమ కుటుంబానికి ఇది ఎంతో పెద్ద ఊరటనిచ్చిందని భావోద్వేగంగా చెప్పారు.అలాగే విద్యార్థిని చదువులో ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న ప్రగతి స్కూల్ యాజమాన్యానికి సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కంతుల శంకర్,పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డేమాన్ నరేందర్, బింగి భాను,కటకం నవీన్,సుంకరి సృజన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పేదరికం అడ్డంకి కాదు...విద్యార్థినికి అండగా సంఘమిత్ర సేవా సమితి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News