Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:44 AM

పేద విద్యార్థినులకు ఫీజుల సహాయం

పేద విద్యార్థినులకు ఫీజుల సహాయం

పేద విద్యార్థినులకు ఫీజుల సహాయం
01-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

క్లబ్, జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులకు విద్యా ఫీజుల సహాయం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల చదువులకు ఆర్థికంగా తోడ్పాటునందించిన డాక్టర్ సాయి కిరణ్‌కు లయన్స్ క్లబ్ స్వచ్ఛ భారత్ జిల్లా కార్యదర్శి లయన్ డాక్టర్ బి. విజయ్ రంగ, జీవనది ఫౌండేషన్ చైర్మన్ ఇంటి లక్ష్మి దుర్గ, సంస్థ జాతీయ అధ్యక్షురాలు కవిత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి. సహస్ర చౌదరి (8వ తరగతి)కు రూ.30 వేల, బి. సాయి నికిత (8వ తరగతి)కు రూ.30 వేల, వనస్థలిపురానికి చెందిన కే. ప్రీతి విస్మయ (డిగ్రీ ద్వితీయ సంవత్సరం)కు రూ.45 వేల చొప్పున విద్యా ఫీజుల సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా లయన్ డాక్టర్ బి. విజయ్ రంగ మాట్లాడుతూ, నేటి పరిస్థితుల్లో విద్య ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులు మధ్యలో ఆగిపోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని అన్నారు. జీవనది ఫౌండేషన్‌తో కలిసి మరింత మంది ఆడపిల్లలు విద్యలో ముందుకు రావడానికి సహకరిస్తామని తెలిపారు.

చదువుకున్న మహిళ కుటుంబానికి, సమాజానికి బలమని పేర్కొన్న ఆయన, బాలికల విద్యపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కోరారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు అండగా నిలుస్తున్న డాక్టర్ సాయి కిరణ్ సేవలను ప్రశంసించారు.

డాక్టర్ సాయి కిరణ్ ఐవీఎఫ్ స్పెషలిస్టుగా సేవలందిస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 12 గోల్డ్ మెడల్స్ సాధించిన ప్రతిభావంతురాలని తెలిపారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరింత మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తన సేవా కార్యక్రమాలకు భర్త, కుమార్తె, కుమారుడు కూడా సహకరిస్తున్నారని డాక్టర్ సాయి కిరణ్ పేర్కొన్నారు.

Sthanikam

పేద విద్యార్థినులకు ఫీజుల సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News