Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

09-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

భువనగిరి: పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

గురువారం భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులు, బోధన విధానం, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులు, డార్మిటరీ హాల్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అని తెలుసుకున్నారు. భోజనశాలను తనిఖీ చేసి ఆహారం నాణ్యత, వంటశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వంట సామగ్రి, బియ్యం తదితర సరుకుల నాణ్యతను పరిశీలించి గడువు తేదీలను తప్పనిసరిగా సరిచూడాలని ఆదేశించారు.

అలాగే పాఠశాల పరిసరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచిస్తూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News