Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం
27-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 27 (స్థానికం న్యూస్) సోమందేపల్లి మండలంలో పాఠశాలల భద్రత మరియు ఆస్తుల పరిరక్షణపై ఎంపీడీవో కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, సోమందేపల్లి ఎస్‌.ఐతో పాటు మండలంలోని అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) చైర్మన్లు, సభ్యులు హాజరయ్యారు.

పాఠశాలల్లో ఉన్న విలువైన వస్తువులను భద్రంగా నిల్వ ఉంచాలని అధికారులు సూచించారు. భద్రతపై తహసీల్దారు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్‌.ఐ, హెడ్మాస్టర్లు, SMC సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి బాధ్యత తీసుకోవాలని తెలిపారు.

ప్రతి పాఠశాలలో CCTV కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, సాధ్యం కాని చోట వాచ్‌మన్‌ను నియమించాలని నిర్ణయించారు. అన్ని హెడ్మాస్టర్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, CCTV ఫుటేజ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. హైస్కూల్‌లలో ఉన్న CCTVలను పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మానిటరింగ్ చేయాలని సూచించారు.

పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొళాయిలు మరియు ఇతర విలువైన వస్తువులు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట సోలార్ ఆధారిత CCTV కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణను పోలీస్ శాఖ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ చర్యలతో పాఠశాలల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పాఠశాలల భద్రతపై సమన్వయ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News