పటేల్ రమేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనిట్
పటేల్ రమేష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా యూనిట్
Vikram Journalist
నివాసంలో కలసి సన్మానం చేసిన జర్నలిస్టులు
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ సూర్యాపేట జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఆయనను నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం ప్రతినిధులు రమేష్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకులు మాట్లాడుతూ ప్రజా సేవా కార్యక్రమాల్లో పటేల్ రమేష్ రెడ్డి చురుకుగా వ్యవహరిస్తూ సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తున్నారని అభినందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు షేక్ రషీద్, గుడిపూడి రామకృష్ణ, కందుకూరి యాదగిరి, షేక్ జహీర్, రామచంద్ర రాజు, దుస్సా చంద్రశేఖర్, దుర్గం బాలు, పోలోజు సందీప్, వెంకట్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి