Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:36 AM

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

06-04-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రొటోకాల్ పాటించలేదంటూ NDCMS బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించడంపై కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

జిల్లా కేంద్రంలోని బత్తాయి మార్కెట్‌లో, అలాగే డాన్ బోస్కో కాలేజీ వెనుక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించి 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్‌కు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధిని పట్టించుకోకుండా, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

ఇక, అధికార పార్టీ నేతల సూచనల మేరకే మేనేజర్ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం పట్ల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పని చేయించుకుని తొలగింపు.. యువకుల ఆవేదన

బత్తాయి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో స్థానిక యువకులను పనికి తీసుకుని, పదిరోజుల తరువాత అకస్మాత్తుగా తొలగించడం మరో వివాదానికి దారి తీసింది. అవసరం లేకపోతే ఎందుకు పని చేయించుకున్నారని యువకులు ప్రశ్నిస్తున్నారు. మేనేజర్‌ను ప్రశ్నిస్తే, “స్థానిక కాంగ్రెస్ నాయకులను అడగండి” అని సమాధానం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Sthanikam

ప్రొటోకాల్‌కు పంగనామం.. NDCMS మేనేజర్‌పై కార్పొరేటర్ల ఆగ్రహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News