Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:13 PM

ప్రిన్సిపాల్ ఎస్. రాజా ఎక్కడ? కలెక్టర్లు మారినా… నిర్లక్ష్యం యథాతథం!

22-04-2026 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విధుల్లో ఉండాల్సిన ప్రిన్సిపాల్ గైర్హాజరు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.

పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాస్టల్‌లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి పూర్తి నివేదిక సమర్పించాలని వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం జనంపల్లి బాలికల రెసిడెన్షియల్ కళాశాలకు వెళ్లగా, ప్రిన్సిపాల్ ఎస్. రాజా హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం సహించబోమని హెచ్చరించిన ఆయన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, వేసవిలో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ చెల్లింపులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

ప్రిన్సిపాల్ ఎస్. రాజా ఎక్కడ? కలెక్టర్లు మారినా… నిర్లక్ష్యం యథాతథం!

Article Image

రామన్నపేట: అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. విధుల్లో ఉండాల్సిన ప్రిన్సిపాల్ గైర్హాజరు కావడం తీవ్ర చర్చకు దారి తీసింది.

పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాస్టల్‌లో ఉన్న లోపాలను వెంటనే గుర్తించి పూర్తి నివేదిక సమర్పించాలని వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం జనంపల్లి బాలికల రెసిడెన్షియల్ కళాశాలకు వెళ్లగా, ప్రిన్సిపాల్ ఎస్. రాజా హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం సహించబోమని హెచ్చరించిన ఆయన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, వేసవిలో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ చెల్లింపులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News