Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:40 AM

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు

09-04-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పట్టణంలోని 37వ వార్డులో పర్వతాపురం గ్రామానికి వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ నహిమ్ అహ్మద్ కూటమి నాయకులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఈ రహదారి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పీవీ పార్థసారధి ప్రత్యేక చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అంచనా వేయించి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.

పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, జనసేన పట్టణ అధ్యక్షుడు రేణు వర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగార్జున, సీనియర్ నాయకులు లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సుబ్రహ్మణ్యం, వీరప్ప, జనసేన నాయకులు ఉరుకుందు శ్యామ్, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, రామ్మూర్తి, భువన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News