Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

23-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ప్రభుత్వ సిటీ కళాశాల గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుక్ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమాన్ని ఆచార్య కోయి కోటేశ్వరరావు ప్రారంభించగా, ముఖ్య అతిథులుగా డా. దుర్గాప్రసాద్, డా. విజయ్‌కుమార్, డా. నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఈ-లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ వంటి ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యేతర పుస్తకాలు, జీవిత చరిత్రలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

విద్యార్థులు తనుషా ‘అంబేద్కర్ కథలు’, మహేష్ ‘భగత్‌సింగ్ చరిత్ర’, అనిల్‌కుమార్ ‘అహల్యాబాయి హోల్కర్’ పుస్తకాలపై సమీక్షలు సమర్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేలా సాగింది.

డా. రవికుమార్ చేగోని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News