Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

25-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఏ. భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇళ్ల వద్ద పాత టైర్లు, కూలర్లు, ఖాళీ పాత్రలు, కొబ్బరి బోండాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ ఎం. మనోహర్ మాట్లాడుతూ దోమ కాటు వల్ల మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రపంచ విజేతగా నిలిచిన Alexander the Great కూడా దోమ కాటు కారణంగా మరణించినట్లు చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాండు నాయక్, ఆర్‌ఎంఓ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎన్. వంశీకృష్ణ, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ వీణ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్య లక్ష్మి, వైద్య అధికారి డాక్టర్ నిరోషా, సబ్ యూనిట్ అధికారులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News