Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:42 AM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

11-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరగూడ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరగూడ, ఉప్పర్పల్లి, అట్టాపూర్ ప్రాంతాల ప్రజలు కమ్యూనిటీ వాక్ నిర్వహించారు. “టుగెదర్ ఫర్ హెల్త్ – స్టాండ్ విత్ సైన్స్” అనే థీమ్‌తో పెద్ద తల్లకుంట పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లింగ్ రమేష్, మొండ్రా కొమ్రయ్య, కే. హరినాథ్, సహదేవ రెడ్డి, బర్ల జంగయ్యతో పాటు గైనకాలజిస్టు డాక్టర్ రాణి కొప్పుల, ఇస్కాన్ అట్టాపూర్ ప్రతినిధి రాధాకాంత్ దాస్ పాల్గొన్నారు.

జీవనశైలి వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అహంసూత్ర మీడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఎస్‌పీఏఆర్‌కే వాక్‌థాన్’ పేరుతో ప్రతి నెల వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాల కారణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్, శానిటేషన్ డ్రైవ్ వాయిదా పడింది.

సీనియర్ జర్నలిస్టులు మాధవ్ మధుసూదన్, అజిత్ రాచూరి మాట్లాడుతూ భారత్‌ను డయాబెటిస్ రాజధానిగా పిలవడం హెచ్చరికగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని అన్నారు.

Sthanikam

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వాక్‌థాన్. ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రజల్లో అవగాహన

Article Image

హైదరగూడ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదరగూడ, ఉప్పర్పల్లి, అట్టాపూర్ ప్రాంతాల ప్రజలు కమ్యూనిటీ వాక్ నిర్వహించారు. “టుగెదర్ ఫర్ హెల్త్ – స్టాండ్ విత్ సైన్స్” అనే థీమ్‌తో పెద్ద తల్లకుంట పార్క్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానికులు నల్లింగ్ రమేష్, మొండ్రా కొమ్రయ్య, కే. హరినాథ్, సహదేవ రెడ్డి, బర్ల జంగయ్యతో పాటు గైనకాలజిస్టు డాక్టర్ రాణి కొప్పుల, ఇస్కాన్ అట్టాపూర్ ప్రతినిధి రాధాకాంత్ దాస్ పాల్గొన్నారు.

జీవనశైలి వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వక్తలు పేర్కొన్నారు. ప్రజలే ముందుకు వచ్చి ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా అహంసూత్ర మీడియా ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఎస్‌పీఏఆర్‌కే వాక్‌థాన్’ పేరుతో ప్రతి నెల వాక్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

అయితే 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాల కారణంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎన్‌సీడీ స్క్రీనింగ్, శానిటేషన్ డ్రైవ్ వాయిదా పడింది.

సీనియర్ జర్నలిస్టులు మాధవ్ మధుసూదన్, అజిత్ రాచూరి మాట్లాడుతూ భారత్‌ను డయాబెటిస్ రాజధానిగా పిలవడం హెచ్చరికగా తీసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News