Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:50 AM

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

09-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 46 అర్జీలను స్వీకరించారు.

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై బాధ్యతాయుతంగా స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా వచ్చిన అర్జీలలో రెవెన్యూ శాఖకు 24, గ్రామీణాభివృద్ధి శాఖకు 5, మున్సిపాలిటీకి 4, హౌసింగ్ శాఖకు 2, పోలీస్ శాఖకు 2, డివిజనల్ పంచాయతీకి 2 అర్జీలు వచ్చాయి. అలాగే సర్వే ల్యాండ్, జిల్లా సంక్షేమ, ఎస్‌డీసీ, ఇరిగేషన్, ఆర్టీసీ, విద్య, రోడ్లు-భవనాలు తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలు సత్వర పరిష్కారం చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News