Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

06-04-2026 191 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో తుమ్మలగూడెం, నిధాన్‌పల్లి గ్రామాల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలగూడెం సర్పంచ్ విక్రమ్, ఉప సర్పంచ్ పోలిపాక జయసుధ, నిధాన్‌పల్లి సర్పంచ్ నారపాక మాధవి, ఉప సర్పంచ్ కొండ అండాలు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.

సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ రామన్నపేటను తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా సాధించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు, ప్రజలు అందరూ ఏకమై ఉద్యమిస్తేనే లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్, మాధవి స్పందిస్తూ నియోజకవర్గ సాధన కోసం సమితి చేపట్టే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్ల నరేందర్, గడ్డం యాదగిరి, డాక్టర్ నకిరేకంటి అశోక్, ఎండీ ఫజల్, జెట్టి శివప్రసాద్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్, ఆవుల నరేందర్, ఎండీ ఇమామ్, మీర్ ఖాజా అలీ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రజాప్రతినిధుల సన్మానం… నియోజకవర్గ సాధనకు పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News