Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం

24-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలు, విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తుమ్మల వెంకటరెడ్డి,మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి రైతులకు నీరు అందించిన అపర భగీరథుడు కేసీఆర్ అని అన్నారు. వరి పంటలో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనుడు కేసిఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని,కుంగిపోయిందని అబద్ధపు మాటలు చెప్పి జస్టిస్ గోష్ కమిషన్ వేసి కేసిఆర్ ను బద్నాం చేయాలని చూసినా నేడు కాలేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అవకతవకలు జరగలేదని కోర్టు స్పష్టంగా తీర్పునిచ్చిందని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తం కుమార్ రెడ్డి కలసి ఢిల్లీకి వెళ్లి సిబిఐ మీద ఒత్తిడి తెస్తామని అంటున్నారని సిబిఐ సంస్థకు చేయడం చేతకాదా అని జిల్లా నాయకులు కొమురెల్లి సంజీవరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పల్సం రమేష్,పట్టణ అధ్యక్షులు అప్రోజ్, యూత్ అధ్యక్షులు పల్సం రాజు,టేకులసోమవారం సర్పంచ్ పడమటి మమతారెడ్డి,కేర్చిపల్లి సర్పంచ్ మద్దెల మంజుల,వలిగొండ వార్డు మెంబర్ బల్గూరి నరేష్ రెడ్డి,ఐటిపాముల ప్రభాకర్,స్వామి,వెలువర్తి గ్రామ అధ్యక్షులు కలుకూరి రాములు, నాగిల్ల యాదగిరి,పోలేపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తాం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News