Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

ప్రైవేట్ స్కూళ్లకు అండగా డిప్యూటీ డీఈఓ?.. సస్పెన్షన్‌ డిమాండ్

23-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడారు.

పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించమంటూ ఒత్తిడి తెచ్చి, పుస్తకాలు, టై, బెల్టు పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేక మంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

డిప్యూటీ డీఈఓ తన నివాసాన్నే కార్యాలయంగా మార్చి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాలంటే సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే విచారణ చేపట్టి సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

ప్రైవేట్ స్కూళ్లకు అండగా డిప్యూటీ డీఈఓ?.. సస్పెన్షన్‌ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News