Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:45 AM

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ
29-03-2026 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.మమత

రామన్నపేట: జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నందున, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత డిమాండ్ చేశారు.

ఆదివారం రామన్నపేట మండలంలోని ఎస్ఎఫ్ఐ మండల కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మమత, పాఠశాలలు అనుమతి లేకుండా పుట్టగొడుగుల ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశలో విద్యార్థులపై బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఇది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఇంకా అమలు చేయని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ఇకనేరుగా, అనుమతులు లేని పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయాలని, జిల్లాలో ఫీజుల దోపిడీ జరిపే ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 9500 కోట్లు స్కాలర్‌షిప్ ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని మమత డిమాండ్ చేశారు. అలాగే, హాస్టల్ విద్యార్థులకు ఆరు నెలల నుండి మేస్ చార్జీలు విడుదల చేయడం లేదు, తద్వారా విద్యార్థులు ఇబ్బందికి గురి అవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్ నాయక్ పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ స్కూల్‌ల ఫీజుల దోపిడీ: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News