Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:23 PM

ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం – సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

09-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

రామన్నపేట: ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. ఆదివారం రామన్నపేట పట్టణంలో నిర్వహించిన ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రజా ఉద్యమాలకు ప్రజావిరాళం కూడా సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాటి పాత తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా పేరొందిన రామన్నపేట నేడు అనేక సమస్యలతో నిండిపోయిందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.20 కోట్ల నిధులు కేటాయించి సమగ్ర అభివృద్ధి చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణంలో పారిశుధ్య లోపం, తాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు వినోదం కోసం పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు.

అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద నీరు ఇండ్లలోకి చేరుతున్న పరిస్థితి ఉందని, దీనికి శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థను పక్కాగా ఏర్పాటు చేయాలని అన్నారు. అంతర్గత రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించడంతో పాటు కోతులు, కుక్కలు, పందుల బెడద నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని అన్నారు.

సిపిఎం చేపట్టే ప్రజా పోరాటాలకు ప్రజలు విరాళాలు అందించి సమస్యల పరిష్కారానికి జరిగే ఉద్యమాలకు బాసటగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్యాస్ ధరల పెంపుపై నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలతో కలిసి గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. యుద్ధాలను కారణంగా చూపిస్తూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారీ భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కందుల హనుమతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, నాయకులు పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం, బాబూచారి, వేముల మల్లేశం, బండ శ్రీశైలం, మునికుంట్ల రాణి, కుందూరు వెంకటేశం, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం – సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News