Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

22-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి బడిబాట సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వివరించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బడి ఈడు పిల్లల వివరాలు సేకరించి, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చదువు మానేసిన వారి వివరాలను నమోదు చేసి, సరైన ప్రణాళికతో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు కూడా సేకరించి ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సర్పంచుల సహకారం తీసుకోవాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే ఇతరులకు నమ్మకం పెరుగుతుందని అన్నారు.

తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉపాధ్యాయులు ప్రావీణ్యం పెంపొందించుకోవాలని సూచించారు.

సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. సత్యనారాయణ, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News