Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం

07-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, కళాశాల ప్రత్యేకతలను వివరించారు.

ఉచిత ఇంటర్ విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నట్లు వెల్లడించారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, ల్యాబ్ సదుపాయాలు, గ్రంథాలయం, క్రీడా ప్రాంగణం, బస్సు సౌకర్యం వంటి వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. EAPCET, JEE, NEET, CLAT వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, నరసింహారావు, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జీవి రావు, పున్నారావు, కిరణ్, ఉమా రాణి తదితరులు పాల్గొని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని కోరారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రచారంతో అడ్మిషన్లకు ఊతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News