Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

18-04-2026 267 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు!

Article Image

చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని 392 సర్వే నెంబర్ గల గాదిరెడ్డిపల్లి వద్ద గల ప్రభుత్వ భూమిలో రైల్వే ట్రాక్ పనుల పేరుతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జానీ షరీఫ్ దాడులు నిర్వహించి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు ఇటాచి యంత్రాలు, ఒక టిప్పర్ వాహనాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిని దోచుకుంటూ, రైల్వే పనుల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నా పర్యవేక్షణ లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News