Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:49 AM

ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకం

11-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి, :

చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ కాలనీలో ఉన్న మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్‌గా మార్చే ప్రతిపాదనకు కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్‌కు ఇవ్వవద్దని వారు ముక్తకంఠంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీవాసుల వినతిపై స్పందించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, పార్క్ కోసం అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రస్తుతం ఆ స్థలాన్ని ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తెలియజేసిన నేపథ్యంలో, ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్‌ను పోలీస్ స్టేషన్ కోసం వినియోగించాలనే ప్రతిపాదనపై కాలనీవాసుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని, రెండు మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరుతామని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్లు నరసింహ గుప్త, విట్టల్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రభాత్ నగర్ కాలనీ అధ్యక్షులు బాల్ రెడ్డి, గట్టు శ్రీను, రమణా రెడ్డి, రామారావు, రాజేష్, నాగేందర్, బాలరాజు, విద్యాసాగర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ప్రతిపాదనకు వ్యతిరేకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News