Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:37 AM

పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు అండగా ‘కళ్యాణమస్తు’ పథకం… వివాహానికి రూ.20 వేల గోల్డ్ కాయిన్ అందజేత

15-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు క్లస్టర్ పరిధిలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కే కొత్తగూడెం పాల సంఘంలో ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాల ఉత్పత్తిదారురాలు ఓబిల్లనేని జ్యోతి కుమారుడు సతీష్ వివాహాన్ని పురస్కరించుకుని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన “కళ్యాణమస్తు” పథకం ద్వారా రూ.20,000 విలువైన బంగారు నాణెాన్ని వరుడికి అందజేశారు. ఈ గోల్డ్ కాయిన్‌ను జిల్లా పాలకవర్గ సభ్యులు బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి.ప్రసాద్, సంఘ అధ్యక్షులు మల్లెంపల్లి గంగారత్నం చేతుల మీదుగా ఘనంగా అందజేశారు. పాల ఉత్పత్తిదారుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలుస్తూ రైతు కుటుంబాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి.నరసింహారావు, వేతన కార్యదర్శి ఎం.గోపాలరావు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతు సంక్షేమానికి ఇలాంటి పథకాలు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

Sthanikam

పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు అండగా ‘కళ్యాణమస్తు’ పథకం… వివాహానికి రూ.20 వేల గోల్డ్ కాయిన్ అందజేత

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు క్లస్టర్ పరిధిలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కే కొత్తగూడెం పాల సంఘంలో ఆనందోత్సాహాల మధ్య ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాల ఉత్పత్తిదారురాలు ఓబిల్లనేని జ్యోతి కుమారుడు సతీష్ వివాహాన్ని పురస్కరించుకుని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన “కళ్యాణమస్తు” పథకం ద్వారా రూ.20,000 విలువైన బంగారు నాణెాన్ని వరుడికి అందజేశారు. ఈ గోల్డ్ కాయిన్‌ను జిల్లా పాలకవర్గ సభ్యులు బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి.ప్రసాద్, సంఘ అధ్యక్షులు మల్లెంపల్లి గంగారత్నం చేతుల మీదుగా ఘనంగా అందజేశారు. పాల ఉత్పత్తిదారుల కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కృష్ణా మిల్క్ యూనియన్ అండగా నిలుస్తూ రైతు కుటుంబాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి.నరసింహారావు, వేతన కార్యదర్శి ఎం.గోపాలరావు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రైతు సంక్షేమానికి ఇలాంటి పథకాలు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News