Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

11-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల చివరి వర్కింగ్ డే ఉత్సాహంగా, భావోద్వేగంగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన ఈ రోజును ఆనందంగా జరుపుకున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ స్నేహాలు, గురువుల బోధనలను స్మరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ జీవితంలో తొలి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ, సోమవారం జరిగే సోషల్ పరీక్షకు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.

భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ టీచర్ స్వరూప రాణి మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలి మెట్టుగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు

Sthanikam

పదో తరగతి విద్యార్థుల చివరి రోజు – ఆనందం, జ్ఞాపకాల నడుమ ముగింపు

Article Image

రామన్నపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల చివరి వర్కింగ్ డే ఉత్సాహంగా, భావోద్వేగంగా జరిగింది. విద్యార్థులు తమ జీవితంలో కీలకమైన ఈ రోజును ఆనందంగా జరుపుకున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ స్నేహాలు, గురువుల బోధనలను స్మరించుకుంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ జీవితంలో తొలి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ, సోమవారం జరిగే సోషల్ పరీక్షకు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.

భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ టీచర్ స్వరూప రాణి మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో తొలి మెట్టుగా భావించాలని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని సూచించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News